తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ భూ కబ్జా ఆరోపణల్లో చిక్కుకున్నారు. స్వగ్రామమైన ఉగ్గంపల్లిలో ప్రభుత్వ పాఠశాలను కూల్చివేసి పార్కింగ్ కోసం ఎమ్మెల్యే రెడ్యానాయక్ వాడుకుంటున్నారన్నది ఈ ఆరోపణల సారాంశం. ఈమేరకు డీఎస్ వెంకన్న నాయక్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన మూడెకరాల స్థలాన్ని ఎమ్మెల్యే కబ్జా చేశారని వెంకన్న తన పిటిషన్‌లో ఆరోపించారు. తన భార్య, ఇద్దరు కొడుకుల పేర్లను మార్చి మొదటి విడతలో ఇందిరమ్మ గృహలు పొందారని, ఉపాధి హామీ పథకం కింద తన పేరున గల భూమిని కుమారుని పేరు మీద ఉన్నట్లు చూపించి నిధులు పొందారని కూడా పిటిషన్ లో కోర్టుకు నివేదించారు.

వెంకన్న నాయక్‌ పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని హోంశాఖను అదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదికి వాయిదా వేసింది. కాగా ఇదే అంశంలో వెంకన్న నాయక్ దశాబ్ధాలుగా వివిధ దశల్లో పోరాడుతూ రెడ్యానాయక్ పై ఆరోపణలు చేయడం గమనార్హం. చిన్న గూడూరు పోలీస్ స్టేషన్ లో గతంలో వెంకన్న ఫిర్యాదు కూడా చేసినట్లు స్థానిక పాత్రికేయులు చెబుతున్నారు. వెంకన్నది దశాబ్ధాల పోరాటంగా వారు అభివర్ణించారు.

Comments are closed.

Exit mobile version