అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన గురించి తప్ప ఇతరుల గురించి ఏ మాత్రం ఆలోచించరా? కరోనా వైరస్ గురించి ఏమాత్రం సీరియస్ గా తీసుకోలేదా? అందువల్లే వైరస్ వ్యాప్తిని, కరోనా బాధిత మరణాల సంఖ్యను ట్రంప్ తగ్గించలేకపోయారా? పైగా కరోనా కారణంగా ఎంతో మేలు జరిగిందని, తద్వారా అసహ్యకరమైన వ్యక్తులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పిందని వ్యాఖ్యానించారా?
ఔనంటున్నారు వైట్ హౌజ్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అసిస్టెంటుగా పనిచేసిన ఒలివియా ట్రాయ్. ఇందుకు సంబంధించి ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పరిణామం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ట్రంప్ ను తీవ్ర ఇరకాటంలోకి నెడుతుందనే వాదన వినిపిస్తోంది.
ఇప్పటికైనా ట్రంప్ నిజస్వరూపాన్ని ప్రజలు గమనించాలని, అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ను గెలిపించాలని ఒలివియా ట్రాయ్ ఈ సందర్భంా అభ్యర్థిస్తున్నారు. అయితే ట్రాయ్ ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆమె వైట్ హౌజ్ నుంచి నిష్క్రమించినపుడు తన పాలనను మెచ్చుకుంటూ లేఖ రాశారని ట్రంప్ పేర్కొన్నారు. ఒలివియా ట్రాయ్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. ఇక ఒలివియా ట్రాయ్ విడుదల చేసిన ఆ వైరల్ వీడియోను దిగువన చూసేయండి.