ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు. ఇరవై రోజులుగా కనిపించకుండాపోయిన కిమ్ గురించి భిన్న కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆయన చనిపోయారని, ఆయన తర్వాత కాబోయే నేత ఆయన సోదరి కిమ్ యో జోంగ్ అతనికంటే తోపు అంటూ పలువురు పలు రకాలుగా ఊహాగానాలు చేస్తూ వార్తలు రాశారు. ఆయా వార్తా కథనాలను పటాపంచలు చేస్తూ కిమ్ ప్రజల ముందు ప్రత్యక్షమైనట్లు ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ’ (కేసీఎన్ఏ) కొన్ని ఫొటోలు విడుదల చేసింది.
ఉత్తర కొరియా రాజధాని సమీపంలోని సన్ చాన్ ప్రాంతంలో నిర్మించిన ఓ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నట్లు కేసీఎన్ఏ నివేదించింది. ఆయా మీడియా సంస్థ విడుదల చేసిన ఫొటోలను ఇక్కడ చూడవచ్చు.