చిన్నపిల్లలకు గాడిద పాలు తాగించడం మనం చూస్తుంటాం. గాడిద పాలు పట్టడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగడమేగాక అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని అనేక మంది విశ్వసిస్తుంటారు. తెలుగింటి లోగిళ్ల ముందు గాడిద పాల విక్రయం సహజ దృశ్యమే. మన హైదరాబాద్ వీధుల్లో అయితే గాడిద పాలకు మరీ డిమాండ్ ఎక్కువ. గాడిద పాల లీటర్ ధర కూడా ఈ మధ్య బాగా పెరిగిపోయిందట. సరే గాడిద పాల సంగతి కాసేపు వదిలేద్దాం. దిగువన గల వీడియోను ఓసారి తీక్షణంగా వీక్షించండి.
నడివీధుల్లో ‘గాడిద’లను నిలిపి పాలు పితికిన చందంగా ఇతను మేక పాలను ఎలా తీసి విక్రయిస్తున్నాడో. అయిదింటితో కూడిన చిన్నపాటి మేకల మందను పగ్గాలు వేసి మరీ బంధించాడు. నడివీధుల్లో ఇతను ఇలా మేకల పాలను పితుకుతూ బతుకు వెళ్లదీస్తున్నాడు. మేకలు కూడా ఎంతో క్రమశిక్షణగా నిల్చోవడం విశేషం. ఇది నేపాల్ వీధుల్లో తీసిన వీడియోగా ఓ సీనియర్ జర్నలిస్టు పోస్ట్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆరోగ్య రహస్యం మేక పాలుగానే పలువురు ప్రస్తావిస్తుంటారు. మనం మాత్రం వాటి పాలను వదిలేసి, మేక మాంసాన్ని మాత్రమే భుజిస్తున్నాం. నేపాల్ వాళ్లు మాత్రం మేక పాల ప్రాధాన్యతను గుర్తించి ఇలా పిండేసుకుంటున్నారట. అదీ సంగతి. ఇక వీడియో చూడండి.