భద్రాచలం సరిహద్దుల్లో గల ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా అడవుల్లో మావోయిస్టు నక్సలైట్లు మందుపాతర పేల్చారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్ కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మరణించగా, మరో తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.

ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం… సుక్మా జిల్లా తాడ్ మెట్ల ప్రాంతంలోని బుర్కపాల్ కు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని అడవుల్లో గాలింపు చర్యలను చేపట్టిన కోబ్రా పోలీసుల తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పోలీసులను నక్సలైట్లు లక్ష్యంగా చేసుకుని ఈ మందుపాతర పేల్చారు.

మందుపాతర పేల్చడంతో తీవ్రంగా గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, అసిస్టెంట్ కమాండెంట్ నితిన్ భలేరావు మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. క్షతగాత్రులైన మిగతా తొమ్మిది మంది రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన చెప్పారు.

ఫొటో: రాయపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్ర జవాన్లు ( పిక్చర్ క్రెడిట్: బస్తర్ కీ ఆవాజ్)

Comments are closed.

Exit mobile version