‘’Sir you are here in Delhi to attend a wedding but you have no time to visit the Cyberabad victim’s family,” Times Now reporter asked only to get no response from the CM. Rao remained tight-lipped and walked away.

ఈ ప్రశ్న వేయడానికి తెలుగు మీడియా జర్నలిస్టులు సాహసిస్తారా చెప్పండి? ఒక వేళ సాహసించిన విలేకరికి ఎదురయ్యే చేదు అనుభవం అంతా ఇంతా కాదు. ప్రశ్నను ఎదుర్కున్న విలేకరిని ఉద్దేశించి నాయకులు చేసే ఎదురుదాడి వ్యాఖ్యలకు పడీ, పడీ నవ్వుతూ ‘మార్కులు’ కొట్టేయడం కొందరు జర్నలిస్టులకు అదోరకం ఆత్మ సంతృప్తి. సరే అసలు విషయానికి వద్దాం.

తెలంగాణా సీఎం కేసీఆర్ మంగళవారం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ రాజీవ్ శర్మ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరు కావడం కోసం ఆయన ఢిల్లీకి వెళ్లారు, తిరిగి హైదరాబాద్ కూడా వచ్చారు. కానీ ఈ రిసెప్షన్ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ను జాతీయ మీడియా ప్రతినిధులు ఎయిర్ పోర్టులోనే చుట్టుముట్టారు. హైదరాబాద్ లో దారుణ హత్యాచారానికి గురైన దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ కేసీఆర్ ను నిలదీశారు. అయితే ఢిల్లీ మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే సీఎం కేసీఆర్ అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో కేసీఆర్ ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీకి వచ్చారంటూ జాతీయ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎయిర్ పోర్టులో తనను చుట్టుముట్టి ప్రశ్నించిన విలేకరులపై కేసీఆర్ విరుచుకుపడకపోవడం గమనార్హం. ‘‘ఎంత ఘోరమైన ఆరోపణ చేస్తున్నావ్, ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నవ్? బయట ఎల్లయ్య ఏదో మాట్లాడుతడు. ఓ సీఎంను, నన్ను పట్టుకుని అడుగుతవానవయా? సోయి ఉండి మాట్లాడాలె.’ అని ఓ విలేకరి ప్రశ్నకు జవాబుగా గత నెల 2వ తేదీన ఆర్టీసీ సమ్మె అంశంలో కేసీఆర్ స్పందించిన తీరు గుర్తుంది కదా? దేశ రాజధానిలో ఎన్నో అంశాలపై వార్తలు ప్రచురించే తెలుగు మీడియా కూడా ఢిల్లీ ఎయిర్ పోర్టులో కేసీఆర్ కు ఎదురైన అనుభవానికి సంబంధించి వార్తలు ప్రచురించిన దాఖలాలు లేకపోవడం కొసమెరుపు.

కాగా దిశ ఘటన వెలుగులోకి వచ్చిన రోజు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజు పిడమర్తి రవి వివాహ వేడుకకు కూడా సీఎం హాజరయ్యారు. అయితే ఆర్టీసీ కార్మికులతో చర్చ సందర్భంగా దిశ హత్యోదంతపై కేసీఆర్ స్పందించారు. దిశకు న్యాయం జరిగేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments are closed.

Exit mobile version