పెళ్లి బరాత్ అంటే మన దగ్గర ఎలా ఉంటుంది. డీజే సౌండ్ తో హుషారైన పాటలతో, యువకుల డాన్స్ లతో సాగుతుంది కదా? మహా అయితే ఓ రెండు పెగ్గులేసి సంతోషంతో గంతులేస్తుంటారు. కానీ గుజరాత్ లో ఓ సంపన్నుడు ఏం చేశాడో తెలుసా? తన పెళ్లి ఊరేగింపులో రూ. కోటి…ఔను అక్షారాల కోటి రూపాయల కరెన్సీ నోట్లను వెదజల్లాడు. అన్నీ రూ. 500, 2,000 నోట్లే. చిత్తు కాగితాల్లా జనంపైకి విసిరేశాడు. తమపై కురిసిన కరెన్సీ నోట్ల వర్షానికి ఊరేగింపులో పాల్గొన్న జనాలు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అందినకాడికి ఏరుకుని జేబుల్లో వేసుకున్నారు. ఊరేగింపు ప్రారంభమైన ఉధయం నుంచి అర్థరాత్రి వరకు ఈ నోట్ల వెదజల్లుడు కార్యక్రమం నిరాటంకంగా సాగింది. జనం కేరింతలే, కేరింతలు. కేవలం డబ్బు వెదజల్లడమే కాదు, 20 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఈ వధూవరులు హెలీకాప్టర్ ను వినియోగించడం మరో విశేషం.

ఇంతకీ ఎవరా కోటీశ్వరుడు అనుకుంటున్నారా? గుజరాత్ లోని జామ్ నగర్ జడేజా గ్రూప్ సంస్థ అధినేత రుషిరాజ్ సిన్హా. వ్యాపారవేత్తగానే కాకుండా ఖరీదైన కార్లు, గుర్రపు స్వారీలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడట. అంగరంగ వైభవంగా జరిగిన తన పెళ్లి వేడుక ఊరేగింపులో రుషిరాజ్ సిన్హా కోటి రూపాయలను చిత్తు కాగితాల్లాగా వెదజల్లిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Comments are closed.

Exit mobile version