వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన శపథంపై మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవితలతో కలిసి హైదారాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి శపథంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…

“ప్రజలు.. ప్రజలండీ.. అసెంబ్లీకైనా, పార్లమెంటుకైనా ప్రజలు పంపిస్తారు.. అర్థమైందా!? నేను ఈ అసెంబ్లీ గేట్లను మా చిన్నప్పటి నుంచి తాకుతూనే ఉన్నాం.. ఓ కే..? మా నాయిన తాకిండు.. మేం తాకినం.. ప్రజలు పంపిస్తారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే అసెంబ్లీకిగాని, పార్లమెంటుకుగాని వస్తాం. వాళ్ళు, వీళ్ళు అడ్డుకుంటామంటే., తాకనీయమంటే అదేమన్నా ఇదా..!? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.. ప్రజల ఓటు హక్కును అపహాస్యం చేస్తున్నారు” అని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు

Comments are closed.

Exit mobile version