సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ సీఎం అయితే తప్పేముంది? అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారట. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదనే మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈటల స్పందించినట్లు తాజాగా ఓ పత్రిక వార్తాకథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ‘మా దగ్గర 99 శాతం ముఖ్య కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ గారే చూస్తారు. ముఖ్యమంత్రిగారి పాత్ర పోషిస్తరు. ఇప్పుడు కూడా కేటీఆర్ హాజరయ్యారు.’ అని ఈటల వ్యాఖ్యానించినట్లు ఓ పత్రిక వార్తా కథనం. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైందని, అంతకు ముందు సీఎం కేసీఆర్ కొన్ని యాగాలు కూడా చేస్తారనే సారాంశంతో సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రెండ్రోజులుగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఆయా పోస్ట్ ఏమిటో దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవండి.
వచ్చే నెలే సీఎం గా కేటీఆర్ ప్రమాణ స్వీకారం.. ముహుర్తం ఖరారు..?
వచ్చే నెలలోనే మంచి ముహుర్తం చూసి ఫిక్స్ చేశారు పురోహితులు..
కేటీఆర్ సీఎం అయితే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా కేటీఆర్ ఎప్పుడెప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారని టీఆర్ఎస్ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈ మధ్య చాలామంది సీనియర్ నేతలు సైతం కేటీఆర్ త్వరలో రాష్ట్రానికి సీఎం అవుతారని చెబుతున్నారు.
అయితే కేటీఆర్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రం రెండో ముఖ్యమంత్రిగా ఫిబ్రవరి18న కేటీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని సమాచారం.
ఈ మేరకు కేసీఆర్ అన్ని ఏర్పాాట్లు పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ సీఎం గా కేటీఆర్..
ఈ మేరకు బ్రాహ్మణ పురోహితులు ముహూర్తం నిర్ణయించారని తెలిసింది.
ఈ లోపు కేసీఆర్ యాగాలు కూడా నిర్వహిస్తారని తెలుస్తోంది. అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం కేసీఆర్ నిర్వహిస్తారని సమాచారం.
ఆ యాగాలు పూర్తయిన తర్వాత కొడుకుకు పట్టాభిషేకం చేస్తారని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.
గత రెండు నెలలుగా కేటీఆర్ సీఎం అవుతారని ప్రచారం జోరుగా జరుగుతుంది.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు సీఎంగా అర్హతలు ఉన్నాయంటూ సమర్ధిస్తున్నారు.