జోయె ర్వామిరామ… ఉగండాలోని కంపాలా ప్రాంత నివాసి. జోయె ఏ రంగంలోనూ ప్రముఖుడు కాదు. కానీ అతను ప్రస్తుతం ప్రపంచంలోనే ఓ వార్తగా నిలిచాడు. అతను చేసిన ఘనకార్యం కూడా ఏమీ లేదు. కానీ వార్తల్లో వ్యక్తిగా ఎందుకు నిలిచాడో తెలుసా? కేవలం తాను వదిలే ‘అపాన వాయువు’ వల్ల. పదం అర్థం కాలేదా? అయితే, కాస్త ఇబ్బందికరమైనప్పటికీ వాడుక భాష పదానికే వస్తే ‘పిత్తు’కు పర్యాయ పదం అపానవాయువు. దీన్ని వదులతూ వార్తగా నిలిచిన జోయె గురించి కంపాలకు చెందిన స్థానికులు అతని గురించి ఎటువంటి వేళాకోళం చేయకపోవడం గమనార్హం. పైగా ఏమంటున్నారంటే… ‘జోయె దరిదాపుల్లో దోమలే ఉండవు, అతను మా దగ్గర ఉంటే చాలు, అపాన వాయువు వదులుతున్నాడని ఏ రోజు కూడా మేం అతన్ని  వేళాకోళం చేయలేదు. అంతే కాదు జోయెను మేం ఎంతో గౌరవిస్తాం కూడా. జోయె వల్ల తమ గ్రామంలో డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులకు మూల కారణమైన దోమలు చనిపోతున్నాయి. జోయె మాకు ఎంతో మేలు చేస్తున్నాడు తెలుసా?’ అంటూ తెగ మురిసిపోతున్నారు.

జోయె వదిలే అపాన వాయువు దెబ్బకు ఆరు మీటర్ల పరిధిలో దోమలన్నీ చనిపోతున్నాయట కూడా. ఇతని ‘గ్యాస్‘ శక్తి గురించి తెలుసుకున్న ఓ కంపెనీ దోమలను చంపే మందు తయారీ కోసం జోయెకు ఉద్యోగం కూడా ఇచ్చిందట. అతను ఆ కంపెనీలో చేసే ఉద్యోగ బాధ్యతలు ఏమిటి? అనేగా సందేహం? ఏమీ చేయక్కరలేదు. గ్యాస్ ఫాం అయ్యే ఫుడ్ ను తింటూ, కడుపులో చల్ల కదలకుండా అపానవాయువును ఓ ఛాంబర్ లోకి వదలడమే అతని డ్యూటీ. కానీ తన అపాన వాయువుతో దోమల మందు తయారీకి ఉపక్రమించి, ప్రయోగాలు చేస్తున్న కంపెనీ పేరును జోయె అత్యంత రహస్యంగా ఉంచాడు. కంపెనీ నిబంధనల ప్రకారం అతి వృత్తి ధర్మం కావచ్చు మరి. ఇదిలా ఉండగా, talkofnaija.com అనే వెబ్‌సైట్‌తో జోయె మాట్లాడుతూ, ‘నేను సాధారణ ఆహారాన్నే తింటాను. కానీ నాపై ఏ కీటకం వాలదు. నన్నెప్పుడు దోమలు కుట్టవు. సాధారణ వ్యక్తుల్లో వచ్చే వాసనే నా నుంచి కూడా వస్తుంది. నేను రోజూ స్నానం కూడా చేస్తాను. అందరి మాదిరిగానే అపానవాయువు వదులుతా.  అది చిన్నస్థాయి క్రిమి కీటకలాకు, దోమలకు మాత్రమే ప్రమాదకరం’ అని వివరించారు.

Comments are closed.

Exit mobile version