హంతకులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందా? ఇలా ఇవ్వడం సాధ్యమేనా? చట్టం అనుమతిస్తుందా? హంతకులకు పరిహారం ఇచ్చుకుంటూ పోతే నేర నియంత్రణ పోలీసులకు సాధ్యమేనా? ప్రభుత్వ అధికారులకు రక్షణ ఉంటుందా? సమాజంలో శాంతి, భద్రతలు అదుపులో ఉంటాయా? ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురానికి చెందిన కొందరు రైతులు చేసిన డిమాండ్ ఇటువంటి అనేక ప్రశ్నలను రేకెత్తిస్తున్నది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన కూర సురేష్ మృతికి ముఠాపురానికి చెందిన కొందరు రైతులు సంఘీభావం తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారుట. అంతేకాదు రెవెన్యూ ధన దాహానికి బలైన సురేష్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు.

సురేష్ రైతే కావచ్చు…కానీ ఓ ప్రభుత్వ అధికారిని దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు. సురేష్ చనిపోయాడు గాని, బతికి ఉంటే హత్య చేసిన తనకూ మద్దతు ఇచ్చిన కొందరిని చూసి ఎంతగా సంతోషించేవాడో కదా? అంతే కాదు… ఓ నిందితునికి నష్టపరిహారం ఇవ్వాలని కోరడం, ర్యాలీ నిర్వహించడం చట్ట వ్యతిరేక చర్య. పాపం ముఠాపురంలోని కొందరు రైతులకు ఈ అద్భుతమైన సలహా ఇచ్చిన మహానుభావుడు ఎవరో?

Comments are closed.

Exit mobile version