యాభై లక్షల రూపాయల నగదుతో ఓ జర్నలిస్ట్ పోలీసులకు పట్టుబడ్డాడు. కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తనిఖీల్లో గరుడ బస్సులో వైజాగ్ కి చెందిన ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ తరలిస్తన్న 50 లక్షల రూపాయల నగదును పోలీసులు గుర్తించారు.
వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న టీవీ రిపోర్టర్ వద్ద నుండి ఆయా భారీ మొత్తపు నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న నగదును, రిపోర్టర్ ను పోలీసులు మీడియా ముందు ప్రదర్శించారు. ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుండా రూ. 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళున్న న్యూస్ ఛానల్ రిపోర్టర్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నగదు హవాలా నగదా కాదా అనే కోణంలోనేగాక ఇంకా ఎవరి పాత్ర ఏమైనా ఉందా అని కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ చెప్పారు.