దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ పిలుపునకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణా సీఎం కేసీఆర్ సైతం ప్రధాని పిలుపునకు మద్ధతు పలకడం మరింత బలాన్నిచ్చింది. దీంతో తెలంగాణా ప్రజలు తమ తమ ఇళ్లకే పూర్తిగా పరిమితమయ్యారు. తెలంగాణాలోని అనేక ముఖ్య నగరాలు పూర్తి నిర్మానుష్యంగా మారాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సరిహద్ధుల్లో గల ఉమ్మడి జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో జనతా కర్ఫ్యూ దృశ్యాలను సీనియర్ ఫొటో జర్నలిస్ట్ నాగరాజు దేవర అద్భుతంగా చిత్రీకరించారు. ఏరియల్ వ్యూ ద్వారా తీసిన జనతా కర్ఫ్యూ చిత్రాలను దిగువన స్లైడ్ షోలో చూడండి.