భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు చైనా ‘డ్రాగన్’ను చంపేశాడా? డ్రాగన్ దురాగతంపై ఇండియా తగిన రీతిలో స్పందించనుందా? చైనాపై ఇండియా తిరుగులేని ‘రామబాణాన్ని’ సంధిస్తుందా? తద్వారా చైనాకు తగిన బుద్ధి చెబుతుందా? ‘తైవాన్ న్యూస్’ ప్రచురించిన ఓ ఫొటో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. సరిహద్ధుల్లో దురాగతానికి పాల్పడిన చైనా 20 మంది భారతీయ సైనికులను బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తైవాన్ న్యూస్ ‘ఫొటో ఆఫ్ ది డే’ శీర్షికన సంచలన వార్తా కథనాన్ని ప్రచురించింది.
దసరా పర్వదినం సందర్భంగాఇండియాలో రావణాసుర వధ ఘట్టం గురించి అందరికీ తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రతి భారతీయుడు రావణవధను అభివర్ణిస్తాడు. ఈ నేపథ్యంలోనే ‘మేం జయించాం… మేం చంపేశాం’ (We conquer, We kill) అనే హెడ్డింగ్ ద్వారా ‘తైవాన్ న్యూస్’ ప్రచురించిన ఫొటో ప్రపంచాసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనపు ‘ఇమేజ్’ను కూడా దిగువన చూడవచ్చు.