ఊహ…ఇలా జరిగితే ఎలా ఉంటుందనే భావన లేదా ఆలోచన కావచ్చు. ఫలానా నాయకుడు ప్రస్తుతం ఉన్న స్థానంలో కాకుండా మరో స్థానంలో ఉంటే? ఫలానా పార్టీ ఇప్పడున్న పరిస్థితుల్లో కాకుండా అధికారంలో ఉండి ఉంటే? ఏం జరిగేది? ఇదో రకం ఊహ…అనడం కన్నా, వర్తమాన రాజకీయాల్లో, సమకాలీన అంశాలపై గతంలో జరిగిన ఘటనలు, నాయకుల ప్రసంగాలు. చేసిన వ్యాఖ్యలను బేరీజు వేసుకుని కాబోలు ‘నిఖిల్ సంగని’ పేరున సోషల్ మీడియా పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఆర్టీసీ సమ్మె, పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ ఉద్యమ నేతగానే ఉండి ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, ఆర్టీసీ సమ్మె ఇలాగే కొనసాగితే, తెలంగాణాలో రాజకీయ పరిస్థితులు, నేతల వ్యవహారశైలి ఎలా ఉండేదో చూడండి అంటూ ఆ పోస్టులో వివరించారు. సీరియస్ గా తీసుకోవద్దు..సరదాగా చదువుకోండి..అంతే. ఇదీ ఆ పోస్టు, ఉన్నది ఉన్నట్లుగానే…

ఈ సమయంలో రాష్ట్రంలో వేరే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే..!?
> ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ, కార్మికులను కాపాడుకోవడానికి.. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా వీరోచిత పోరాటం చేసేది.
> కేసీఆర్ మరోసారి స్వయంగా జానారెడ్డి ఇంటికి పోయి ఆర్టీసీని కాపాడుకోవడానికి జేఏసీ పెడదాం..రా అంటూ కోరేటోడు.
> నా ప్రాణం ఉన్నంత వరకు ఆర్టీసీని ఆగం కానియ్య అంటూ.. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు, ప్రజలకు ధైర్యం చెబుతూ.. ఉపన్యాసాలను దంచేటోడు.
> ఆర్టీసీ కార్మికులకు అండగా చేసే పోరాటంలో హరీశ్ రావు అంగీ మళ్ళోసారి చినిగి.. సొమ్మసిల్లి పడేటోడు. అవసరమైతే ఇంకోసారి మీద పెట్రోల్ పోసుకోవడానికి కూడా వెనకాడక పోయేటోడు.
> ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న కేటీఆర్ ను అడ్డుకుంటే.. ఐజీ స్థాయి పోలీస్ అధికారులను కూడా లెక్కచేయకుండా ఇంకోసారి బండ బూతులు తిట్టేటోడు.
> కవితక్క రోజుకొక డిపో కాడికి పోయి మహిళా కార్మికులతో కలిసి బతుకమ్మ ఆడి నిరసన తెలిపేది.
> చివరగా ‘కేసీఆర్ సచ్చుడో-ఆర్టీసీ బతుకుడో’ అన్న నినాదంతో కేసీఆర్ మరోసారి నిరాహార దీక్షకు దిగేటోడు.

ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి ఉంటే..!?
> ఆర్టీసీ సమ్మె ఎప్పుడో ముగిసేది..
> ఆర్టీసీని ప్రయివేట్ పరం చేయాలని చూస్తే.. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై తిరగబడేటోళ్లు..
> సగం రూట్లను ప్రయివేట్ వాళ్లకు అప్పగించాలనే తీర్మానాన్ని కాబినెట్లో ప్రవేశ పెడితే ఆ కాపీని కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి లాంటి వారు చింపి ముఖ్యమంత్రి మొఖంపై విసిరి కొట్టి బయటకు వచ్చేటోళ్లు.

> వీహెచ్ లాంటి అధికార పార్టీ నేతలే ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళనలు, దీక్షలు చేద్దురు.
> సీఎం అట్లనే మొండిగా ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే సొంత ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కూడా వెనకాడక పోయేటోళ్లు.
-నిఖిల్ సంగని

Comments are closed.

Exit mobile version