ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కిష్టారం సమీపంలో గల పాలచలమ అడవుల్లో కోబ్రా, 208 బెటాలియన్ కు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా బలగాలకు, మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు మధ్య భీకర పోరాటం జరుగుతున్నట్లు సమాచారం.
ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు మరణించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయని ఛత్తీస్ గఢ్ మీడియా నివేదించింది. ఘటనా స్థలం అడవుల్లో పోలీసులు గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.