చైనాలో బీభత్స దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెయ్యేళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైన ఫలితంగా సంభవించిన భారీ వరదల్లో చైనా అతలాకుతలామవుతోంది. ఐ ఫోన్ సిటీగా అభివర్ణించే హెనన్ ప్రావిన్స్ లోని జెంగ్జౌ నగరాన్ని భారీ వరదలు చుట్టుముట్టాయి. పారిశ్రామిక వ్యాపార కార్యకలాపాలకు పేరుగాంచిన ప్రావిన్స్ లోని ప్రస్తుత దృశ్యాలు అక్కడి భీకర వరదలకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. భారీ వరదల వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా, మరో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ప్రావిన్స్ కేపిటల్ సిటీ జెంగ్జౌలో ఒక్కరోజే 457.5 మి.మీ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గత శనివారం నుంచి ఇక్కడ 640.8 మి.మీ. చొప్పున సగటు వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత వెయ్యేళ్లలో ఇంత భార వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారిగా పేర్కొంటున్నాయి. వరద తాకిడికి టన్నెల్ లో చిక్కుకుపోయిన రైలులో ప్రయాణీకుల దుస్థితి, పడవల్లా తేలియాడుతూ కొట్టుకుపోతున్న కార్ల దృశ్యాలను దిగువన వీక్షించవచ్చు.