దైనిక్ భాస్కర్… దేశంలోని ముఖ్య పత్రికల్లో ఇదీ ఒకటి. అషామాషీ పత్రికేమీ కాదు సుమీ. ప్రాంతీయ భాషల్లో మళయాళంలో మనోరమ, తెలుగులో ఈనాడు స్థాయి పత్రిక అన్నమాట. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రింట్ మీడియాపై నీలినీడలు అలుముకుంటున్న నేపథ్యంలో సదరు పత్రిక యాజమాన్యం ఓ ప్రయోగానికి పాల్పడింది. పత్రికల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందనే ప్రచారం జరుగుతున్న కారణంగా ఈ ప్రయోగానికి ఒడిగట్టడం విశేషం. ప్రచురణ సమయంలోనే పత్రికలకు శానిటైజర్ ను స్ప్రే చేస్తున్నారు. ఎడిషన్ సెంటర్లలోనే పత్రికలను శానిటైజర్ తో శుద్ధి చేస్తున్న తీరు అభినందనీయమే. కానీ ఆ పత్రిక ఏజెంట్ వద్దకు, లేదా హాకర్ వద్దకు, అక్కడి నుంచి పాఠకుని చెంతకు చేరే వరకు పలు చేతులు మారుతుంది. ఇక్కడే పరిస్థితి ఏమిటన్నదే అసలు ప్రశ్న. ఇందుకు జవాబు సంగతి ఎలా ఉన్నప్పటికీ, తన పత్రిక వల్ల పాఠకునికి కరోనా వైరస్ సోకదనే భరోసా నింపుతూ ప్రింటింగ్ సమయంలోనే పత్రికలకు శానిటైజర్ స్ప్రే చేయడం అత్యంత ఆసక్తికరం. అందుకు సంబంధించిన వీడియోను దిగువన చూడండి.

Comments are closed.

Exit mobile version