file photo

దిశ హత్యోదంతం నిందితుల ఎన్కౌంటర్ అనంతరం సమాజపు ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ అత్యంత దైవ భక్తుడు కూడా. కర్ణాటకకు చెందిన సజ్జాన్నార్ వీరభద్ర స్వామి భక్తుడు కావడం విశేషం. వరంగల్ యాసిడ్ దాడి ఘటన 2008 డిసెంబర్ 10వ తేదీన జరిగింది తెలిసిందే కదా! అదే నెల 13వ తేదీన యాసిడ్ దాడి నిందితులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. అప్పుడు సజ్జన్నార్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్నారు. యాసిడ్ దాడి నిందితుల ఎన్కౌంటర్ ఘటన తర్వాత అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ని సజ్జన్నార్ విధుల్లో భాగంగా కలుసుకున్నారు. అదేనెల 16వ తేదీన అప్పటి వరంగల్, ఇప్పటి మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి దర్శించుకున్నారు. సీఎం వైఎస్ ను కలిశాక నేరుగా హైదరాబాద్ నుంచి కురవికే వచ్చారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న సజ్జన్నార్ కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దాదాపు రెండున్నర గంటల పాటు సజ్జన్నార్ వీరభద్రస్వామి ఆలయంలోనే గడపడం విశేషం. తన పిల్లలకు స్థానిక షాపుల్లో బొమ్మలు కూడా కొనిచ్చారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ అనంతరం మళ్లీ సజ్జన్నార్ తన ఆరాధ్య దైవమైన వీరభద్రస్వామి దర్శనం చేసుకుంటారా? అని స్థానికులు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. మీరు చూస్తున్నది అప్పటి ఫొటోలే.

Comments are closed.

Exit mobile version