రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనకు ఇచ్చిన ‘వార్నింగ్’పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈమేరకు గురువారం ఓ వీడియో విడుదల చేశారు. తన చెవి తెగుద్దని అజయ్ చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ, ‘కేసీఆర్ కన్నా మీరు గొప్పోళ్లా? నాకు ఐడియా లేదు. దయచేసి కమ్యూనిస్టు పార్టీ పేరు, పువ్వాడ నాగేశ్వర్ రావు పేరు చొప్పుకోవద్దు’ అని నారాయణ అన్నారు. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవద్దు’ అని కూడా నారాయణ వ్యాఖ్యానించారు. మంత్రి అజయ్ ని ఉద్దేశించి సీపీఐ అగ్రనేత నారాయణ ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియోలో చూడండి.

Comments are closed.

Exit mobile version