‘చెప్పేందుకే శ్రీరంగ నీతులు’ అనేది పాత నానుడి. దీన్ని కాస్త మాడిఫై చేస్తే… ‘చెప్పేందుకే టీవీ9 నీతులు’ అనేది సరికొత్త సామెత. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ గురించి నెత్తీ, నోరూ బాదుకుంటున్నాయి. కాస్త మేం చెప్పేది పాటించాలని ప్రజలను పదే పదే కోరుతున్నాయి. ఇదే విషయాన్ని మీడియా సంస్థలు ప్రజలకు వివరిస్తున్నాయి. తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నాయి. కానీ ఎదుటివారికి నీతులు చెప్పే ముందు మనం కూడా పాటించాలి కదా? అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాగే సామాన్య ప్రజలకు చిక్కి నానా చీవాట్లు పడాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో టీవీ9 చేష్టలపై ఓ సామాన్యుడు విసిరిన ఈ ప్రశ్నలకు సదరు సంస్థ నిర్వాహకులే సమాధానం చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటారా? చెప్పడమెందుకు…? దిగువన వీడియోను చూడండి.

Comments are closed.

Exit mobile version