Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»International News»కత్తులతో కాదు… కరోనా ‘వైరస్’ వార్తలతో చంపేట్టున్నారు!

    కత్తులతో కాదు… కరోనా ‘వైరస్’ వార్తలతో చంపేట్టున్నారు!

    January 28, 20205 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 corona

    వామ్మో…వామ్మో..వచ్చేసిందట. మాయదారి చైనా రోగం.. కరోనా వైరస్.. హైదరాబాద్ వరకు రానే వచ్చిందట. గాంధీ దవాఖానలో వంద మందికి పైగా వ్యాధి సోకినట్లు కేసులు నమోదయ్యాయట. నలుగురు చనిపోయారట. అదిగో కరోనా.. ఇదిగో చికిత్స.. అంటూ… చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాలకు వ్యాపించిన ప్రమాదకర కరోనా వ్యాధికి సంబంధించి వివిధ రకాల మెసేజ్ లు సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించే ఉద్ధేశంతోనే అనేక మంది ఇటువంటి మెసేజ్ లను ఇతరులకు ఫార్వార్ట్ చేస్తుండవచ్చు. కానీ అదిగో పులి అంటే.. ఇదిగో తోక చందాన కరోనా వ్యాధికి సంబంధించిన అనేక నిర్ధారణ లేని వార్తలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే ఆందోళనకర పరిణామం. ఇది ప్రజల్లో గందరగోళానికి, ప్రాణ భయానికి దారి తీస్తుందనేది కాదనలేని వాస్తవం. గబ్బిలాల నుంచి కరోనా వ్యాధి పాములకు వచ్చిందని, పాముల విషాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా మనుషులకు సంక్రమించిందనేది సోషల్ మీడియా మెసేజుల్లోని సారాంశం. ఎవరి వాదన వారిదే.

    ts29 IMG 20200128 WA0008

    వాస్తవానికి తెలంగాణాలోగాని, ఆంధ్రప్రదేశ్ లో గాని కరోనా వ్యాధికి సంబంధించి ఎటువంటి వ్యాధిగ్రస్తులను గుర్తించినట్లు అధికారిక సమాచారం లేదు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, సమర్థవంతంగా చికిత్స అందించేందుకు మాత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అవసరమైన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే గాంధీ, ఛాతీ ఆసుపత్రుల్లో అధునాతన పరికరాలతో ఐసీయూలను అందుబాటులోకి తీసుకువచ్చింది. చికిత్స ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర బృందం ఒకటి సోమవారమే హైదరాబాద్ కు చేరుకుంది. ఈ పరిస్థితుల్లోనే కరోనా వ్యాధికన్నా వేగంగా మరింత భయాన్ని కలిగిస్తూ సోషల్ మీడియా పోస్టులు వ్యాప్తి చెందడమే ఆందోళనకర పరిణామమని చెప్పక తప్పదు. వ్యాధిపట్ల అప్రమ్తత్తంగా ఉండడం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. కానీ ప్రజలను భయ, భ్రాంతులకు గురిచేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న తీరు ప్రజలను గందరగోళానికి దారి తీస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అటువంటి అనేక సోషల్ మీడియా పోస్టుల్లో కొన్నింటిని దిగువన చూడవచ్చు. వీటిలో జనహితాన్ని కోరే అంశాలను మాత్రమే స్వీకరించి, మిగతా అంశాలను విస్మరించడమే ప్రజల ప్రాణానికి హాయి.

    సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల్లో ఇదీ ఒకటి:
    అలర్ట్ అలర్ట్ కరోనా వైరస్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తుంది గాంధీ హాస్పిటల్ లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి నలుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ వైరస్ చైనా నుంచి భారత్ కు వ్యాపించినట్లు నిపుణులు చెబుతున్నారు ఈ వ్యాధి లక్షణాలు దగ్గు తుమ్ములు జలుబు చేయడం తో మొదలవుతాయి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోకపోతే కిడ్నీలు లివర్ ల పైన ఎఫెక్ట్ పడుతుంది అసలు ఈ వ్యాధి గబ్బిలాల నుంచి పాములకి వచ్చింది
    పాములని వాటి విషాన్ని స్మగ్లింగ్ చేసే క్రమంలో మనుషులకు వ్యాప్తి చెందింది ఇప్పుడు అది తీవ్రమైన వ్యాధిగా విస్తరిస్తుంది విదేశాల నుంచి భారత్ కి వచ్చే వారిని విమానాశ్రమం లో అధికారులు తనిఖీ చేయడం తెలిసిందే
    ఇప్పటివరకు ఆరు రకాల కరోనా వైరస్లను గుర్తించారు.

    వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
    1) చేతులు తరచుగా కడుక్కోవాలి
    2) మాంసాహారాలు తినకూడదు ముఖ్యంగా చికెన్ మటన్
    3) బయట కనిపించే వస్తువులను తాక కూడదు
    4) జలుబు దగ్గు వంటివి వచ్చినప్పుడు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం
    5) మంచి ఆహారం తీసుకోవడం మంచిది
    6) జనాలు రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్కులు ధరించాలి

    మీరు ఈ విషయాన్ని నమ్మకపోతే యూట్యూబ్ లో ఈ వైరస్ గురించి సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు

    ఈ మెసేజ్ ని స్నేహితులకు బంధువులకు అందరికీ పంపించండి తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి
    Msg from
    P Satyanarayana.MBBS
    Yashoda hospitals

    ఇది మరో పోస్టు:
    Strictly stay away from poultry, seafood, animal products

    It is widely spread in china, singapore, Malaysia & US is also reported to have Corona virus infections.
    India reported 11 cases

    Severe cold, sneezing, respiratory issues, difficulty in breathing are few very common symptoms.
    Since it is virus… take following precautions

    1. Drink boiled water
    2. Stop non veg
    3. Take vitamin C, Zinc, B complex daily RDA Dose for prevention
    4. Strictly follow personal hygiene
    5. Decoction of Tulsi, Ginger, Pepper, Curcumin in hot water helps immensely
    6. Guduchi treats fever & enhances immunity
    7. Take hot rasam or vegetable soups.

    Antibiotics will not work on coronavirus
    Drink hot water like tea sip by sip.
    Now like in finance SIP, You have to also follow SIP in foods ?
    Dr. Sharad Kasarle

    ఇది కూడా సోషల్ మీడియా పోస్టే:
    HOMOEO MEDICINES FOR CORONA VIRUS DISEASE

    Dear Friends,

    There is lot of fear and anxiety among the people travelling abroad about the news about CORONA VIRUS or VUHAN VIRUS.
    Do not worry about it. There are excellent medicines in Homoeopathy to prevent and also to cure. After studying the symptoms available through media our Forum strongly advise the following Homoeo medicines to prevent. We have 44 years of experience in handling various acute and chronic diseases though Homoeopathy. We provide this advise to help the needdy people.

    ARSENIC ALB 30 daily morning 4 pills and evening 4pills for 5 days
    No medicine on 6th day.
    PHOSPHORUS 30 on 7th day morning 4 pills.
    Daily use of the following Homoeo Mother Tinctures also will help to prevent and cure the disease. Use in following way for 15 days.
    1. OCIMUM SANCTUM Mother Tincture ( extract of Krishna Tulasi ).
    Drink morning 10 drops and evening 10 drops with 3 tea spoons of water.
    2. TINOSPORA CORDIFOLIA Mother Tincture ( extract of Amrita balli in Kannada and Thippa theega in Telugu).
    Drink afternoon 10 drops and night 10 drops with 3 tea spoons of water.

    Precautions:
    1. Take all the precautions about cleanliness and hygiene.
    2. Do not consume junk food and non-veg food.
    3. Avoid Direct physical contact with other persons. Use nose mask.
    4. Keep few Homoeo medicines and use when ever there is a need on the advise of Homoeopathic Doctor.
    5. Kindly take medical help when there is a need. Do not neglect.
    Our Forum wishes good health and happiness all. With regards and best wishes
    P V Satyanarayana and all the Members of the Forum.
    Dr. GV Chalapathi Memorial Homoeopathic Self Reliance Forum, ( A Voluntary Service Organisation), Opposite to Scientists Hostel No 2, DRDO Township, C V Raman Nagar, Bangalore – 560093. Mobile No. 93430 94787

    Previous Articleకేటీఆర్ కోటలో రె‘బెల్స్’… ఆ చీటీ, ఫొటో చెబుతున్నదేమిటి?
    Next Article హతవిధీ… ప్రత్యర్థి కాదు, శత్రువర్గ రాజకీయం!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.