అది ఓ హైవే… టోల్ గేట్ దాటిన ఓ కారును మాస్కులు ధరించిన పోలీసులు నిలిపేశారు. మరో వ్యక్తి వచ్చి కారు డ్రైవింగ్ సీట్లో గల వ్యక్తిని ఓ తనిఖీ మెషీన్ తో చెక్ చేశాడు. కారు నడుపుతున్న వ్యక్తి గురించి పోలీసు ఏదో సైగ చేశాడు. ఈలోగా ఆ వ్యక్తి తన కారును ముందుకు కదిలించాడు. అంతే పోలీస్ సైరన్ మోగింది. కారు ముందుకు వెళ్లకుండా మేకులతో కూడిన పొడవాటి చైన్ ను పోలీసులు రోడ్డుకు అడ్డంగా విసిరారు. అంతేగాక ఓ పోలీసు వాహనాన్ని కూడా అడ్డుగా నిలిపారు. కారులోని వ్యక్తి కిందకు దిగి తన మాస్కును తొలగించి ఏదో మాట్లాడుతున్నాడు. పోలీసులు అతన్ని హెచ్చరిస్తున్నారు. కానీ అతను వినిపించుకోకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి పొడవాటి కర్రకు గల ఓ వల లాంటి మాస్కును కారు నడిపిన వ్యక్తి మొహానికి తగిలించి, పెడరెక్కలు విరిచి పట్టుకుని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి కేకలు వేస్తున్నాడు. పోలీసుల సాయంతో వైద్య సిబ్బంది అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆ తర్వాత పోలీసులపైకి ఏవేవో స్ప్రేలు కొడుతున్నారు. సదరు వ్యక్తికి సోకిన వైరస్ తమకు సోకకుండా కాబోలు. అచ్చం సినిమా సీన్ ను తలపించే ఈ ఘటన ఏంటో తెలుసా?

ప్రపంచ దేశాలను తీవ్రంగా భయపెడుతున్న కరోనా వ్యాధిగ్రస్తులను చైనాలో అదుపులోకి తీసుకుంటున్న దృశ్యమిది. చైనాలోని ఏదో హైవేలో కరోనా రోగులను ఇలా అదుపులోకి తీసుకుంటున్నారట. ఇందుకు సంబంధించినదిగా పేర్కొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయా వీడియోను దిగువన మీరూ వీక్షించవచ్చు.

Comments are closed.

Exit mobile version