ఖమ్మం నగరంలోని షాపింగ్ మాల్స్ లో కరోనా కలకలం కలిగిస్తోంది. మొబైల్ టెస్టింగ్ వెహికిల్ ద్వారా గురువారం ఖమ్మం నగరంలోని కస్పాబజార్ వీధిలో నిర్వహించిన పరీక్షల్లో పలు షాపింగ్ మాల్స్ లో పనిచేసే సిబ్బంది కరోనా బారిన పడినట్లు తేలింది. కస్పాబజార్ లోని పలు షాపింగ్ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే దాదాపు 250 మంది సిబ్బందికి, నిర్వాహకులకు కరోనా టెస్టులు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా తేలినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెప్పాయి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా గురువారం నాటి పరీక్షల్లో 200 పైచిలుకు సంఖ్యలో కరోనా పాజిటివ్ బాధితులుగా నిర్దారణ అయినట్లు తెలిసింది.