కరోనా మహమ్మారి సృష్టించిన ఆపత్కాలమిది. సామాన్య ప్రజల సంగతి అలా ఉంచండి. వైద్యరంగానికి చెందిన అనేక మంది కూడా కరోనా బారిన పడుతున్నారు. అక్కడా, ఇక్కడా అనే తేడా లేనే లేదు. ఇదే దశలో వైద్యసేవల్లో పోటీ పడలేక ఓ ప్రముఖ వైద్యునిపై మరోవర్గానికి చెందిన వారు దుష్ప్రచారానికి పాల్పడితే…? అన్యాయమే కాదు, అమానుషం కూడా. కరోనా కల్లోలంలోనూ ఆ డాక్టర్ తన ఆసుపత్రిని మూసుకోలేదు. నిత్యం ప్రజలకు వైద్య సేవలందిస్తూనే ఉన్నారు. అతనే డాక్టర్ వేము గంగరాజు. ఖమ్మం జిల్లా ప్రజల నోళ్లలో నిత్యం నానే ప్రముఖ వైద్యుడు.
ఇదిగో ఈ పరిణామమే ఖమ్మం జిల్లా వైద్యరంగంలోని ఓవర్గానికి రుచించినట్లు లేదు. ఇంకేముంది ఓ ప్రచారానికి తెరలేపారు. డాక్టర్ గంగరాజుకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి దిగారు. గడచిన పది రోజులుగా సోషల్ మీడియాలోని వేర్వేరు వేదికలపై ఈ ప్రచారం కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ డాక్టర్ గంగరాజు పెద్దగా పట్టించుకోలేదు. ఎంతో సహనంతోనే వ్యవహరించారు. కానీ అదే పనిగా కొనసాగుతున్న దుష్ప్రచారాన్ని నిలువరించే ప్రయత్నం చేయకుంటే అబద్ధం నిజమని నమ్మే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే డాక్టర్ గంగరాజు స్పందించారు. ఈమేరకు తన ఫేస్ బుక్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆయన ఏమంటున్నారో దిగువన వినండి.