మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారిన పడ్డారు. వైరస్ అనుమానిత లక్షణాల కారణంగా సీఎం శివరాజ్ సింగ్ నిన్న కరోనా టెస్టుల కోసం శాంపిళ్లను ఇచ్చారు. ఆర్టీపీసీఆర్ వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. తనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్లు తేలిందని సీఎం శివరాజ్ కొద్దిసేపటి క్రితం స్వయంగా ట్వీట్ చేశారు.
కరోనా సోకిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరనున్నారు. గత కొంత కాలంగా మధ్యప్రదేశ్ లోని పలువురు కేబినెట్ మంత్రులకు కూడా కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తనతో ప్రైమరీ కాంటాక్టులో గల వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా సూచించారు.