వీడియో చూశారు కదా? ఖమ్మం నగరంలో కరోనా తీవ్రతకు అద్దం పట్టే దండోరా ఇది. ఎక్కడో మారుమూల పల్లెన కాదు… ఖమ్మం నగరానికి జస్ట్ ఓ ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో గల తెల్దారుపల్లెలో వేయించిన ‘దండోరా’ దృశ్యమిది.
ఖమ్మం జిల్లా కేంద్రంలో కరోనా విలయతాండవం చేస్తోందనే చెప్పాలి. ఇప్పటికే ఇద్దరు వ్యాపార ప్రముఖులు కరోనా బారిన పడి మరణించగా, ఇంకా పలువురు గాంధీచౌక్ వ్యాపారులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ పరిస్థితుల్లోనే శుక్రవారం ఒక్కరోజే జిల్లాలలో 60 పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. రోజు రోజుకూ తీవ్రమవుతున్న కరోనా పరిణామాల్లో ఖమ్మం ఎవరూ వెళ్లవద్దని ఇలా పరిసర పల్లెల్లో దండోరాలు మోగుతున్నాయ్!