తెలంగాణా సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలపై బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. పీఠాలు కదులుతున్నాయనే భయంతోనే కేసీఆర్ పర్యటనలకు శ్రీకారం చుట్టారని బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ లు విమర్శించారు. రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడగా, రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. కేసీఆర్ జిల్లాల పర్యటనలపై ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఏమిటో వారి మాటల్లోనే…

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కామెంట్స్:

  • దుబ్బాకలో ఓటమి భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలుదేరాడు.
  • తమ పీఠాలు కదులుతున్నాయని సీఎం కేసీఆర్ కు స్పష్టంగా అర్థమవుతున్నది.
  • యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తోందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలి.
  • ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడతారా?
  • ఇలాంటి సంస్కారహీనపు మాటలు తెలంగాణ సమాజానికే సిగ్గుచేటు.
  • గజ్వేల్ ఎమ్మెల్యేను ‌‌దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడు.
  • ఇద్దరు సీఎంలు ముందుకొస్తే నీటి పంపకాలను తేల్చడానికి కేంద్రం సిద్ధంగా ఉంది.
  • కేంద్రం నివేదికలు కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా సాకులు చెబుతోంది.
  • రైతుబంధు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడంలేదు.
  • అయినా కూడా సీఎం కేసీఆర్ ఎందుకు ఉలికి పడుతున్నారు.
  • ధాన్యం సేకరణలో పంజాబ్ మెదటి స్థానంలో ఉంది.
  • కానీ తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నాడు.
  • ధాన్యం కొనుగొలులో సీఎం కేసీఆర్ కమిషన్ ఏజెంట్ మాత్రమే.

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్:

  • రామాయణంలో కుంభకర్ణుడి తరహాలో సీఎం కేసీఆర్ తయారయ్యారు.
  • కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తడో, ఎప్పుడు ఫాం హౌజులో పండుకుంటడో తెలియదు.
  • అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మంచిదే, కానీ బీజేపీని టార్గెట్ చేయడం ఎందుకు?
  • తెలంగాణలో తామే అభివృద్ధి చేస్తున్నట్లు, కేంద్రం సాయమే లేదన్నట్లు మాట్లాడారు.
  • రాష్ట్రంలో నియోజకవర్గాలు అంటే సిద్దిపేట, గజ్వేల్ అన్నట్లే వ్యవహరిస్తున్నారు.
  • సీఎం క్యాంపు ఆఫీసుకు నా నియోజకవర్గం నాలుగు కిలోమీటర్లు కూడా లేదు.
  • కానీ నా గోషామహల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు నిధులు రాలేదు

Comments are closed.

Exit mobile version