తెలుగు రాష్ట్రాల్లోని వివాదాస్పద నీటి ప్రాజెక్టుల వద్ద రెండు వారాల్లో కేంద్ర పారిశ్రామిక రక్షణ బలగాలు (CISF) మోహరించనున్నట్లు మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి ప్రకటించారు. రెండు వారాల్లోనే CISF బలగాలు మోహరిస్తాయని చెప్పారు. అదేవిధంగా తమకు కొన్ని సంకేతాలు ఉన్నాయని, నీటి సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని కూడా వెల్లడించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టి జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కృష్ణాజలాల న్యాయమైన వాటా- పెండింగ్ ప్రాజెక్టులు సత్వర పూర్తి’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నీటి సమస్యలపై సీఎం కేసీఆర్ వ్యవహార తీరును జితేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.