అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమితో చైనా సంబరపడుతున్నట్లు కనిపిస్తోంది. కొత్త అధ్యక్షునిగా విజయం సాధించిన జో బైడెన్ గెలుపుపై ప్రపంచ దేశాలు ఆయనను అభినందనల వర్షంలో ముంచెత్తుతున్నాయి. కానీ చైనా మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.
అయితే ఆ దేశ అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ మాత్రం ట్రంప్ శకం ముగిసిందని వ్యాఖ్యనించడం విశేషం. బైడెన్ గెలుపుపై ప్రపంచ నాయకుల అభినందనలను ఉటంకిస్తూనే, ట్రంప్ ఓటమితో కొన్ని దేశాలకు రిలీఫ్ లభించినట్లు పేర్కొనడం గమనార్హం.
మొత్తంగా ట్రంప్ పరాజయంపై చైనా కేరింత కొడుతున్నట్లుగానే భావించవచ్చు. అనేక అంశాల్లో చైనాపై ట్రంప్ దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.