తెలంగాణా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. తమకు అందిన ఫిర్యాదు మేరకు మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తన భూమిలో మంత్రి మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ, కుత్బుల్లాపూర్ మండలం సూరారానికి చెందిన శ్యామలాదేవి అనే మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి ఆక్రమణలో గల తన భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదించానని, అయితే సదరు న్యాయవాదితోనే మంత్రి మల్లారెడ్డి కుమ్ముక్కై తప్పుడు పత్రాలు సృష్టించారని శ్యామలాదేవి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈమేరకు దుండిగల్ పోలీసులు మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు.