ఖమ్మం జిల్లాలో బీజేపీ నాయకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. వైరా మండల కేంద్రంలో ఈ ఉదయం జరిగిన ఘటనలో బీజేపీ నేత నేలవెళ్లి రామారావుపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన కొద్దిసేపటి క్రితం మృతి చెందారు.
బీజేపీ పార్టీ తరపున సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్తగానూ రామారావు పనిచేస్తున్నట్లు సమాచారం. అంతేగాక ఓ వ్యక్తితో రూ. లక్షల ఆర్థిక లావాదేవీల వివాదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యకు ఆయా ఆర్థిక లావాదేవీల వివాదమే కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం చివరికి హత్యకు దారి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.