కర్నాటక రాష్ట్ర కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ఎన్నికయ్యారు. ఈమేరకు బెంగళూరులో నిర్వహించిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఆయనను సభా నాయకుడిగా ఎన్నకున్నారు. పార్టీ పరిశీలకులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ హాజరై శాసనసభా పక్ష నేత ఎన్నికపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించారు.
యడియూరప్ప రాజీనామా అనంతరం సీఎం రేసులో ప్రస్తుత హోం మంత్రి బసవరాజ్ బొమ్మై, సీటీ రవి, అరవింద్ బెల్లాడ్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరికి పార్టీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైనే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా బొమ్మై ప్రమాణ స్వీకారం బుధవారం లేదా గురువారం ఉండవచ్చని భావిస్తున్నారు.