తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది. వివిధ ఆరోపణలపై తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
అనేక కేసుల్లో అరెస్టయిన తీన్మార్ మల్లన్న గడచిన రెండు నెలలుగా రిమాండ్ లోనే ఉన్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేశారనే అభియోగంపై పోలీసులు తొలుత మల్లన్నను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరికొన్ని కేసుల్లోనూ పోలీసులు పీటీ వారంట్ ద్వారా అతన్ని అరెస్ట్ చేశారు.
అయితే మల్లన్నపై నమోదైన అన్ని కేసుల్లో సోమవారం రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు సాయంత్రం మల్లన్న జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా తాను బీజేపీలో చేరుతున్నట్లు మల్లన్న గతంలోనే ప్రకటించారు.