ఫొటోలు చూడండి. వీడియోలు కూడా ఉన్నాయి. కాకపోతే ఆయా వీడియోల్లో వాడిన భాషకు సంబంధించిన అసభ్య పదాలను అయిష్టంగానైనా వినాల్సిన పరిస్థితి. ఓ ఫారెస్ట్ అధికారిపై మట్టి అక్రమ రవాణాదారులుగా భావిస్తున్న వ్యక్తులు నడిరోడ్డుపై ఎలా దౌర్యన్యానికి పాల్పడి దాడి చేశారో చూడవచ్చు.

ఇంతకీ ఆ ఫారెస్ట్ అధికారి చేసిన తప్పేమిటో తెలుసా? తాను విధులు నిర్వహించే రఘునాథపాలెం మండలం చింతగుర్తి బీట్ లోని అటవీ భూముల్లో మట్టిని తవ్వుతున్న జేసీబీని, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలిస్తుండడమే. వాహనాల తరలింపును ఖమ్మం – ఇల్లెందు ప్రధాన రోడ్డుపై మట్టి అక్రమ రవాణాదారులుగా భావిస్తున్న వ్యక్తులు అడ్డుకున్నారు.

ఇంకేముంది…? అటవీ అధికారులపై తొలుత బూతులు అందుకున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులే మా వాహనాలను ముట్టుకోలేదు. నువ్వెవడ్రా పట్టుకోవడానికి అని ఓ వ్యక్తి అటకాయించాడు. ‘… పీఏ కిరణ్’ మాకు బంధువు అంటాడు. ఏ విలేకరిని పిలిపిస్తావో పిలిపించు అంటాడు. ఓ ప్రధాన పత్రిక విలేకరిని పదే పదే ప్రస్తావిస్తాడు. మైనింగ్ అధికారికే ‘ఉచ్చ’ పోయించాను అంటాడు. రఘనాథపాలెం ఎస్ఐని పిలిపించు అంటాడు.

వందలాది వాహనాలు ప్రయాణించే ఇల్లెందు – ఖమ్మం రద్దీ రహదారిపై ఇద్దరి అటవీ అధికారులపై మట్టి అక్రమ రవాణాదారులు దౌర్జన్యపూరితంగా వ్యవహరించి, విధులకు ఆటంకం కలిగించి, వారిపై దాడి చేసినా ప్రశ్నించేవారే లేరు. అటవీ అధికారులపై పిడిగుద్దుల వర్షం కురిపించి వాహనాలను లాక్కుని వెళ్లిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

పట్టపగలు, నడిరోడ్డుపై జరిగిన ఈ అరాచకానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తుల పేర్లను దౌర్జన్యకారులు పదే పదే ప్రస్తావించడం పలు అనుమానాలను కలిగిస్తోంది. ఘటనకు సంబంధించిన ఓ వీడియోను దిగువన చూసేయండి.

Comments are closed.

Exit mobile version