ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో చికిత్స కోసం ఆయనను వెంటనే జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో తరలించారు. అయితే ఈలోగానే ఆయన ప్రాణం కోల్పోయినట్లు సమాచారం.
గౌతమ్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ఐటీ, వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. గత నెల 22న ఆయన కరోనా బారిన పడి కోలుకున్నారు. వైఎస్ఆర్ సీపీ తరపున 2014, 2019 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గౌతమ్ రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు.