Facebook X (Twitter) YouTube
    Tuesday, October 3
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»International News»జపాన్ అల్లాడుతుంటే… ప్రధాని కుక్కతో ఆడుకున్నట్లు…!!

    జపాన్ అల్లాడుతుంటే… ప్రధాని కుక్కతో ఆడుకున్నట్లు…!!

    April 13, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 japan

    ‘రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందం’ సామెత తెలుసుగా? నీరో చక్రవర్తి సంగతేమోగాని జపాన్ ప్రధాని షింజో అబే మాత్రం అచ్చం ఇదే తరహా చేష్టలతో కూడిన వీడియోలు పోస్ట్ చేసి నెటిజన్లకు బుక్కయిపోయారు. కరోనా మహమ్మారి వల్ల జపాన్ దేశంలో ఇప్పటికే ఏడువేల మంది బాధితులుగా మిగిలారు. ఇటువంటి కల్లోల పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ప్రధాని షింజో నిర్ణయించారు. ఇంకా అనేక చర్యలు కూడా చేపట్టారు.

    అంతా బాగానే ఉంది. కానీ… ‘నేను నా ఫ్రెండ్స్ ను కలుసుకోలేను. దావత్ లకు వెళ్లలేను. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కష్టపడుతున్నారు. వారి విషయంలో కృతజ్ఞత చాటుకోవాలి’ అంటూ ప్రధాని షింజో ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే నెటిజన్లు జపాన్ ప్రధానిని ఓ రేంజ్ లో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ‘ఇంతకీ మీ గురించి మీరేమనుకుంటున్నారు? మీరెవరో మీకైనా అర్థమవుతోందా? కరోనాతో ప్రజలు భయానక పరిస్థితిని ఎదుర్కుంటుంటే… బాధ్యతను విస్మరించి, ఇంత విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు? డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పే పద్ధతి ఇదేనా?’ అంటూ జపాన్ ప్రధాని తల బొప్పి కట్టేలా నెటిజన్లు ‘ట్రోలింగ్’కు దిగారు.

    ఇంతకీ జపాన్ ప్రధాని షింజో అబే పోస్టు చేసిన వీడియో ఏమిటో తెలుసా? ఓ వ్యక్తి గిటార్ వాయిస్తున్న దృశ్యపు వీడియో అది. సేవలందిస్తున్న డాక్టర్లకు ధన్యవాదాలు తెలపాలని కోరుతూ పోస్ట్ చేసిన ఆ వీడియోకు తోడుగా తాను హాయిగా సోఫాలో కూర్చుని, టీ తాగుతూ, టీవీ చూస్తూ, తన పెంపుడు కుక్క పిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని ఠీవీగా హొయలు పోతున్న ప్రధాని షింజో వీడియో దృశ్యాలను చూసి నెటిజన్లు భగ్గుమన్నారు.

    జపాన్ ప్రధాని షింజో అబే ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆయా వీడియోలను దిగువన మీరూ చూడవచ్చు.

    友達と会えない。飲み会もできない。
    ただ、皆さんのこうした行動によって、多くの命が確実に救われています。そして、今この瞬間も、過酷を極める現場で奮闘して下さっている、医療従事者の皆さんの負担の軽減につながります。お一人お一人のご協力に、心より感謝申し上げます。 pic.twitter.com/VEq1P7EvnL

    — 安倍晋三 (@AbeShinzo) April 12, 2020
    Previous Article‘అనుభవించు’ రాజా! ఇందుకు మీరే బాధ్యులు… జర్నలిస్టులు కాదు!!
    Next Article ఖమ్మంలో ‘టైంపాస్’ సీన్లు… కరోనాలో వాకర్స్ ‘సోద్యం’!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.