ముందు ఈ వీడియో చూడండి. తర్వాత విషయంలోకి వద్దాం.
అర్థమైంది కదా? అగ్ర రాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ దేశాల పెద్దన్న డోనాల్డ్ ‘కంపు…’ సారీ… ట్రంపు ఏమంటున్నాడో…? ‘కరోనా వైరస్’తో పోరాడుతూ మరణిస్తున్న డాక్టర్ల, నర్సుల మరణం అందంగా ఉందట. అమెరికాలోని అలెన్ టౌన్ పట్టణంలో మెడికల్ కిట్లను ట్రంప్ నిన్న పంపిణీ చేశారు. అక్కడే అధికారగణంతో కీలక సమావేశం నిర్వహించిన తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.
కరోనా మహమ్మారితో పోరాడుతున్న డాక్టర్లను, నర్సుల సేవలను ఓవైపు కీర్తిస్తూనే, ఈ పోరాటంలో వారి చావు అందంగా ఉందంటూ మరోవైపు నోరు పారేసుకున్నారు. రణక్షేత్రంలో పోరాడుతూ బుల్లెట్లకు ఎదురొడ్డి నిలిచి నేలకొరిగే ఆర్మీ వీరుల్లా డాక్టర్లు, నర్సులు చనిపోతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే… వీళ్ల మరణం చూడ్డానికి అందంగా ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలపై నెటిజన్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ‘ మరణం అంత అందంగా ఉంటే ఓసారి నువ్వే ఛస్తే పోలా?’ అని ట్రంప్ కు సలహా కూడా ఇస్తున్నారు.
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేమీ కాదు. ఇటీవలే ఇద్దరు మహిళా రిపోర్టర్ల ప్రశ్నల ధాటికి తాళలేక మీడియా సమావేశం మధ్యలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.