కరోనా కల్లోల పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు లాక్ డౌన్. కానీ టెర్రరిస్టులను మాత్రం ఓ దేశం ‘అన్ లాక్’ చేసింది. అదేమిటీ… అని ఆశ్చర్యపోతున్నారా? ఇది పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న చర్య. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయాద్ సహా పలువురు టెర్రరిస్టులకు స్వేచ్ఛగా తిరిగే వరాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రసాదించింది.
ఇందుకు దారి తీసిన వివరాల్లోకి వెడితే… పాకిస్థాన్లోని లాహోర్ జైల్లో దాదాపు 50 మంది టెర్రరిస్టులకు కరోనా సోకినట్లు ఆ రాష్ట్ర సీఎం ప్రకటించారు. దీంతో కరోనాను సాకుగా చూపుతూ డేంజరస్ టెర్రరిస్టులందరూ స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని పాకిస్థాన్ సర్కార్ కల్పించింది. ఈ నేపథ్యంలోనే హఫీజ్ సయీద్ సహా అత్యంత ప్రమాదకరమైన టెర్రరిస్టులను పాకిస్థాన్ ప్రభుత్వం స్వేచ్ఛా ప్రపంచంలోకి వదిలేసింది.