కరోనా వైరస్ వ్యాప్తి అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా తీరుపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తిలో చైనా హస్తం ఉన్నట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ వైపు హెచ్చరిస్తూనే, విషయంపై సమగ్ర విచారణ జరపడానికి ఓ నిపుణుల టీమ్ ను చైనాకు పంపే యోచన ఉన్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే అమెరికాలో కొనసాగుతున్న ‘లాక్ డౌన్’పై జరుగుతున్న కొన్ని జన ప్రదర్శనలు ట్రంప్ అనూకూల కార్యకలాపాలుగా వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ అంశంలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు భిన్న వైఖరులను అవలంభిస్తున్నప్పటికీ, ఆయా పార్టీల్లోనూ ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నట్లు ఓ కథనం.
అమెరికా అధ్యక్ష స్థానానికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కరోనా వ్యాప్తి కల్లోలంలోనూ అక్కడ జరుగుతున్న కొన్ని ప్రదర్శనలపై భిన్న వాదనలున్నాయి. కరోనా ధాటికి ఇప్పటి వరకు అమెరికాలో 7,70,564 మందికి వైరస్ సోకగా, 41,114 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి భీతావహ పరిస్థితుల్లో అమెరికాలో జరుగుతున్న జన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడవచ్చు.