తెల్లవారితే ఫిబ్రవరి 17వ తేదీ… తెలంగాణా ఉద్యమ సారథి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చిన టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పుట్టినరోజు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలకు, నాయకులకు పండుగ లాంటిది. గులాబీ పార్టీ అధినేత పుట్టిన రోజు సందర్భంగా ఫిల్మ్ డైరెక్టర్ బందూక్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాకతీయ ఇన్నోవేటివ్స్ నిర్వహిస్తున్న ఆర్ట్ ఎగ్జిబిషన్లో అనేక చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇందులో ‘శాండ్ ఆర్ట్’, క్రియేటివ్ కాన్సెప్ట్ ద్వారా ‘కాంత్ రిసా’ అనే జాతీయ అవార్డు గ్రహీత ఆర్టిస్టు రూపొందించిన కేసీఆర్ బర్త్ డే చిత్రాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ ‘అక్రిలిక్’ పద్ధతిలో ఈ చిత్రాలు రూపొందించడం విశేషం. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, 24 గంటల విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఆసరా ఫించన్లు, ఐటీ హబ్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కంటి వెలుగు, మన ఊరు-మన చెరువు, రైతు బంధు, యాదాద్రి ఆలయ నిర్మాణం, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ తదితర పథకాలను ఈ చిత్రాల్లో పొందుర్చడం ప్రత్యేకత. కేసీఆర్ 66వ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించిన ‘అక్రిలిక్’ పెయింటింగ్ ఇమేజ్ లను దిగువన స్లైడ్ షోలో తిలకించవచ్చు.