భస్మాసుర హస్తం అంటే ఇదే కాబోలు. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడనే సామెతకు చైనాలో వ్యాపించిన ‘కరోనా’ వైరస్ ను అన్వయిస్తున్నారు అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకులు. బయో వెపన్స్ ద్వారా ప్రత్యర్థులను నాశనం చేసేందుకు చైనా వేసిన ఎత్తుగడలే ప్రస్తుతం ఆ దేశాన్ని అతలాకుతలాం చేస్తున్నట్లు వెబ్ మీడియా నివేదిస్తోంది. ‘గ్రేట్ గేమ్ ఇండియా’ అనే ఆన్ లైన్ పోర్టల్ వార్తా కథనం ప్రకారం… చైనా తన ఎత్తుగడలో తానే చిత్తయినట్లు భావించాల్సి వస్తోంది. ఇదే అంశంపై G న్యూస్ కూడా మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇంకోవైపు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఆద్యంతపు ఆసక్తికర కథనాన్ని దిగువన మీరూ చదవండి.
కెనడియన్ ల్యాబ్స్ నుంచి దొంగిలించిన కరోనా వైరస్ నిరుడు కెనడా నుంచి వచ్చిన అనుమానాస్పద స్మగుల్డ్ షిప్ మెంట్ ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అందులో ఉన్నది ఏ విలువైన వస్తువో, వజ్రాలో, వైఢూర్యాలో లేక ఆఖరికి డ్రగ్సో కాదు. ఆ పార్సిల్ షిప్ మెంట్ లో ఉన్నది ప్రపంచాన్ని వణికించే సత్తా కలిగిన, ప్రస్తుతం చైనాను చేష్టలుడిగేలా చేసిన కరోనా వైరస్.
కెనడియన్ ల్యాబ్ లో పనిచేస్తున్న చైనా ఏజెంట్లు ఆ కరోనా వైరస్ ని చైనాకు పంపించారని విచారణలో తేలింది. ఈ ప్రాణాంతకమైన వైరస్ ని ఉపయోగించి తయారు చేసిన బయో వెపన్స్ సాయంతో భారత దేశాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలని చూస్తున్న చైనా కుయుక్తులు ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడుతున్నాయి. భారత్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో కరోనా వైరస్ తో ఆటలాడిన చైనా ఆ వైరస్ వల్ల ఇప్పుడు పూర్తిగా కుదేలైందన్నది ఎవరూ తోసి పుచ్చలేని వాస్తవం. వూహాన్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ సత్యాన్ని బలంగా కళ్లకు కడుతున్నాయి.
జూన్ 13, 2012లో ఓ అరవై ఏళ్ల సౌదీ పౌరుడు జెడ్డాన్ లోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా జ్వరం, దగ్గు, తుమ్ములు, జలుబు, తలనొప్పి, ఊపిరి ఆడకపోవడం లాంటి లక్షణాలు వరసగా ఏడు రోజులపాటు ఆతన్ని పీడించాయి. అతనికి శ్వాస కోశానికి సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, పొగతాగే అలవాటు అంతకు ముందు ఉన్న దాఖలాలు ఏం లేదు. కానీ ఆ వ్యక్తి హాస్పిటల్లో చేరిన సమయంలో ఈ లక్షణాలతో గిలగిలలాడాడు.
అప్పుడు ఆ సౌదీ పౌరుడికి ఉన్న లక్షణాలను బట్టి అతని ఊపిరితిత్తుల్లో ఉన్న కరోనా వైరస్ ని ఈజిప్షియెన్ వైరాలజిస్ట్ డాక్టర్ అలీ మొహమ్మద్ జకీ గుర్తించాడు. రోగికి అన్ని రకాలైన పరీక్షలు, అన్ని రకాలైన వైద్యాలు చేసి చూసిన జకీ అంతుచిక్కని ఈ వ్యాధికి సంబంధించిన వివరాలను కనుగొనేందుకు రోటర్ డ్యామ్ లో ఉన్న ఎరాస్మస్ మెడికల్ సెంటర్ లో పనిచేస్తున్న లీడింగ్ వైరాలజిస్ట్ రాన్ పౌచర్ ని సంప్రదించాడు.
జకీ పంపిన శాంపిల్ ని పరీక్షించిన ఫౌచర్ అందులో కరోనా వైరస్ ఉందని నిర్థారించాడు. అత్యాధునిక పరీక్షా పద్ధతుల్ని ఉపయోగించి ఫౌచర్ ఈ విషయాన్ని కనుగొని, నిర్థారించాడు. ఫౌచర్ ఆ వివాదాస్పదమైన శాంపిల్ ని విన్నిపెగ్ లోని కెనడా జాతీయ మైక్రో బయాలజీ లేబొరేటరీ లో పనిచేస్తున్న సైంటిఫిక్ డాక్టర్ ఫ్రాంక్ ప్లమ్మర్ కి పంపించాడు.
సరిగ్గా ఇక్కడే కీలకమైన మలుపు తిరిగింది కథ. ఈ ల్యాబ్ లో పనిచేస్తున్న చైనా ఏజెంట్లు కరోనా వైరస్ శాంపిల్ ని దొంగిలించి దాన్ని రహస్యంగా చైనాకు పంపించారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన షిప్ మెంట్ పార్సిల్ ని క్షుణ్ణంగా తనిఖీచేసి పరిశీలిస్తే అది కరోనా వైరస్ అన్న విషయం బయటపడింది.
చైనాకు ప్రాంణాంతకమైన వైరస్ ని సేకరించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆది నుంచీ కుట్రలు, కుయుక్తులకు పెట్టింది పేరైన అమానుషమైన చర్యలకు పేరు పొందిన చైనా దేశస్తులు, నేతలు బయో ఆయుధాలను తయారుచేసి భారత్ తో పాటుగా వివిధ దేశాలపై ప్రయోగించి ప్రపంచవ్యాప్తంగా అరాచకాన్ని సృష్టించాలని చేసిన కుట్ర ప్రపంచానికి వెల్లడయ్యింది.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిలట్రీ వెటర్నరీ, అకాడమీ ఆఫ్ మిలట్రీ మెడికల్ సైన్సెస్ – ఛుంగ్ చున్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ – చెంగ్ డూ మిలట్రీ రీజియన్, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆప్ వైరాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – హుబీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో బయాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – బీజింగ్ డాక్టర్ జియాంగుయో కియూతో కలిసి ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ ని ఖండాంతరాలు దాటించడంలో పూర్తి స్థాయిలో సహాయం చేసినట్టు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం.
కేవలం ఎబోలాతో మాత్రమే సరిపెట్టుకోకుండా ప్రపంచాన్ని వణికించగల, తమ గుప్పెట్లో పెట్టుకోగల సామర్థ్యం కలిగిన అనేక రకాలైన వైరస్ లను సేకరించి, సృష్టించి వాటి సాయంతో బయో ఆయుధాలను తయారుచేసి దొడ్డి దారిలో లబ్ధి పొందాలని చైనా ప్రభుత్వం చూస్తోందన్నది అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు అందిన పక్కా సమాచారం.
బయో వెపన్ అనే ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా, కరోనా వైరస్ అంశంలో చైనా వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు వివిధ వార్తా కథనాలు వెల్లడిస్తుండడం గమనార్హం.