2014 నుండి నేటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ప్రత్యర్ధులుగా కాక శతృ వర్గాలుగా మారిపోయాయి.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్ననేత, ప్రతిపక్షస్థానంలో ఉన్న నేత రాజకీయ పట్టుదలలకు పోవడం దురదృష్టకరం.
ఇలాంటి పరిస్థితుల్లోనే మధ్యవర్తిత్వం నెరపాల్సిన నేతలు, ఆ స్థాయి వ్యక్తులూ కనుమరుగయ్యారు. అలాంటి అవకాశాలకు కూడా తావు లేకుండా రాజకీయాలు నడుస్తున్నాయి.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల సొమ్ముతో పనిచేస్తున్నామనీ, ప్రజలకోసమే పని చేస్తున్నామనే స్పృహను నేతలు కోల్పోతున్నారు. అందుకే రాజకీయం ప్రజల కోసం కాకుండా పోయింది. రాజకీయం అంటే పార్టీల, పార్టీ అధినేతల ఆధిపత్యం చెలాయించడం అనే దుర్గతికి వచ్చింది.
లౌకిక భావజాలం పునాదిగా ఉన్న కాంగ్రెస్, ప్రజల తరపున ఉండాల్సిన వామపక్షాలు తమ పునాదులు వదిలి దూరంగా వెళ్ళడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది.
నోరు పారేసుకోవడం, దుర్భాషలాడటమే నేటిరాజకీయం. రాజ్యాంగం తెలియకపోయినా, రూల్సు తెలియకపోయినా ప్రత్యర్ధిని తిట్టడానికి నాలుగు ఘాటైన పదాలు, ఎగతాళి చేయడానికి ఓ రెండు, మూడూ చిల్లర పదాలు తెలిస్తే చాలు, రాజకీయాల్లో వేగంగా ఎదగొచ్చు.
ఇలా అధమ స్థాయికి దిగజారిన రాజకీయాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయో!?
-దారా గోపి @fb