ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహిరి ఇక లేరు. గాయకుడిగానూ ప్రసిద్ధిగాంచిన బప్పీలహిరి (69) అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధపడుతున్నారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే బప్పీలహిరి తుదిశ్వాస విడిచారు.
హిందీ సినిమాల సంగీత దర్శకుడిగా పేరుగాంచిన బప్పీలహిరి పలు తెలుగు చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా ఆయన సంగీతం అందించిన గ్యాంగ్ లీడర్, సింహాసనం, సామ్రాట్ వంటి తెలుగు సినిమాలు హిట్టయ్యాయి. బప్పీలహిరి సంగీతం అందించిన ఆయా సినిమాల్లోని రెండు పాటలను దిగువన వీక్షించవచ్చు.