భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వు జారీ చేసింది. మొత్తం 30 మంది ఐపీఎస్ అధికారులు బదిలీకి గురయ్యారు. వీరిలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సహా పలువురు సీపీలు, ఎస్పీలు ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లా ఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. త్వరలోనే మరికొందరు పోలీసు అధికారుల బదిలీ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు అధికారుల బదిలీ, పోస్టింగ్ వివరాల ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.