ఆఫ్ఘనిస్థాన్ లోని ‘పంజ్ షేర్’లో 600 మంది తాలిబన్లు హతమయ్యారా? ఔనంటోంది రష్యాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ స్ఫుత్నిక్. తాలిబన్ల రాజ్యాధికార ఎపిసోడ్ లో పంజ్ షేర్ ప్రాంతం ప్రతిబంధకంగా మారిన సంగతి తెలిసిందే.
పంజ్ షేర్ స్వాధీన పోరాటంలో 600 మంది తాలిబన్లను రెసిస్టెన్స్ దళాలు హతమార్చినట్లు ‘నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్’ వర్గాల ద్వారా తెలుస్తోందని రష్యా మీడియా సంస్థ స్ఫుత్నిక్ నివేదించింది. ఈ పోరాటంలో దాదాపు మరో వెయ్యి మందికిపైగా తాలిబన్లను రెసిస్టెన్స్ దళాలు అదుపులోకి తీసుకున్నాయని, మరికొందరు తాలిబన్లు రెసిస్టెన్స్ దళాలకు లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
పంజ్ షేర్ తాలిబన్ల స్వాధీనమైనట్లు ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ఇక్కడి పోరులో 600 మంది తాలిబన్లు హతమైనట్లు తాజాగా వార్తలు వస్తుండడ గమనార్హం. ప్రస్తుతం పర్యాన్ జిల్లాలో జరుగుతన్న భీకర పోరులో రెసిస్టెన్స్ దళాలు తాలిబన్లకు చుక్కలు చూపిస్తున్నట్లు తాజా వార్తల సారాంశం. పంజ్ షేర్ లోకి వెళ్లే మార్గల్లో మందుపాతరల ఏర్పాటు వల్ల తాలిబన్లు కదలడం కూడా గగనంగా మారినట్లు తెలుస్తోంది.