ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న వీసీ సజ్జన్నార్ ను బదిలీ చేస్తూ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించింది. సజ్జన్నార్ స్థానంలో సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం వెస్ట్ జోన్ ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగా తెలంగాణా రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగపు చీఫ్ గా అనిల్ కుమార్ ను ప్రభుత్వం నిన్న నియమించింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో గల ప్రభాకర్ రావు ఎస్ఐబీ ఆపరేషన్స్ చీఫ్ బాధ్యతల వరకు ప్రభుత్వం పరిమితం చేసింది. గడచిన కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిన ఆయా అధికారుల బదిలీలు పాలక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.