ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. బీజాపూర్ జిల్లా గంగళూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎస్. పూనమ్ శనివారం రాత్రి తన అత్తగారింటికి వెడుతుండగా, మార్గమధ్యంలో నక్సల్స్ అతన్ని అటకాయించి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత దారుణంగా హత్య చేసి కేష్కుతుల్ సమీపాన అతని డెడ్ బాడీని పడేశారు. ఈ ఘటనను బీజాపూర్ ఎస్ఫీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు. కానిస్టేబుల్ మృతదేహాన్ని భైరామ్గఢ్కి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు చెప్పారు.