వెళ్ళండి, వెళ్ళండి
రూపాయికి, ఐదు రూపాయలకే
దిక్కులేదు ఇప్పుడు..
చెల్లని నాణాలు మీరు
వొల్లని నాణాలుమీరు
విలువలేని మీతో
ఇక మాకేం పని?
పూర్వ వైభవాలంటారా
వాటిని మీతోనే ఉంచుకోండి
పైసకు నాలుగు చేగోడీలు
పది పైసల నేల టికెట్టు
రెండణాల టెంకాయ
ఐదు పైసల అరటిపండు
మూడు పైసల కమ్మరకట్టు
రోజులు మారాయి
ఆ రోజులు మళ్లీ రావు
మరి, ఎందుకు కాలం వృథా?
అందుకే వెళ్ళండి, వెళ్ళండి
చిల్లర నాణాలు మీరు
వెళ్ళండి, వెళ్ళండి!!
✍️ పాయసం సుబ్రహ్మణ్య మహర్షి