ఈ వీడియో గుర్తుంది కదా? నిన్న గాక మొన్ననే… అంటే ఈనెల 13వ తేదీన ఈ వీడియో తెలంగాణాలోనే కాదు, దేశ వ్యాప్తంగా కలకలాన్ని సృష్టించింది. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలోడి అడవుల్లో గల ఓ వాగు నుంచి వందలాది మంది నక్సలైట్లు వాగు దాటుతుండగా పోలీసులు డ్రోన్ కెమెరాలో చిత్రీకరించారనేది ఆయా వీడియో దృశ్యం గురించి వచ్చిన వార్తా కథనాల సారాంశం.
అయితే ఈ వీడియో విషయంలో మీడియా మరోసారి బకరా అయ్యిందనేది తాజా సమాచారం. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు లొంగిపోతారనే వార్తల తరహాలోనే మీడియా మరోసారి భంగపాటుకు గురైంది. అసలు ఆ వీడియోలో ఉన్నది నక్సలైట్లు కానే కాదనేది బస్తర్ పోలీసు వాదన.
బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పేరుతో వెలువడిన పత్రికా ప్రకటనలోని సారాంశం ప్రకారం… ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా ఈనెల 13న ర్యాలీ నిర్వహణకు దంతెవాడకు చెందిన ఖైదీ రియా మంచ్ తరపున ఒకరోజు ధర్నా, ర్యాలీ నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగానికి ఓ దరఖాస్తు అందింది. అయితే ఈ దరఖాస్తు అస్పష్టంగా ఉందని, ప్రస్తుత కరోనా మహమ్మారి పరిణామాల కారణంగా ర్యాలీ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. ఎటువంటి ర్యాలీలు నిర్వహించవద్దని కూడా నిర్వాహకులకు అధికారగణం సూచించింది.
? सूचना/जानकारी
कोरोना महामारी संक्रमण की रोकथाम प्रयासों के विपरीत जनता को दिग्भ्रमित करके उनकी स्वास्थ्य को खतरा उत्पन्न करने वाले व्यक्तियों के विरूद्ध कड़ी से कड़ी कानूनी कार्यवाही की जावेगी
ज्ञात हुआ है कि कुछ व्यक्तियों द्वारा 13 सितम्बर 2020 को जिला दन्तेवाड़ा में सुरक्षाबल द्वारा विश्व आदिवासी अधिकार दिवस पर रैली करने वाले ग्रामीणों के ऊपर बल प्रयोग किये जाने के संबंध में दिग्भ्रमित जानकारी प्रेषित की जा रही है। वास्तविकता एैसा है कि दिनांक 12 सितम्बर 2020 को जेल बंदी रिहाई मंच जिला दन्तेवाड़ा की ओर से जिला मुख्यालय दन्तेवाड़ा में एक दिवसीय धरना प्रदर्शन एवं रैली हेतु जिला प्रशासन को एक अस्पष्ट आवेदन दिये गये थे।
वर्तमान में कोरोना महामारी की परिस्थिति को ध्यान में रखते हुये आयोजक को रैली न करने की प्रशासन द्वारा समझाईश दी गई, इसके बावजूद दिनांक 13.09.2020 को जिला दन्तेवाड़ा, बीजापुर और सुकमा के सीमावर्ती क्षेत्र के कुछ ग्रामीणों आयोजक द्वारा प्रचारित उक्त रैली में शामिल होने आ रहे थे। कोरोना महामारी संक्रमण रोकथाम हेतु पालन की जा रही प्रोटोकाल के अनुसार उन ग्रामीणों को समझाईश दी जाकर उन्हें वापस अपना-अपना गांव भेजा गया।
ग्रामीणों के ऊपर बल प्रयोग की जाने के संबंध में प्रचारित की जा रही खबर असत्य एवं निराधार है। कोरोना महामारी संक्रमण की रोकथाम प्रयासों के विपरीत जनता को दिग्भ्रमित करके उनकी स्वास्थ्य को खतरा उत्पन्न करने वाले व्यक्तियों के विरूद्ध कड़ी से कड़ी कानूनी कार्यवाही की जावेगी।
(सुंदरराज पी.)
पुलिस महानिरीक्षक,
बस्तर रेंज
ఈ నేపథ్యంలోనే దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాలకు గిరిజనులు ర్యాలీ నిర్వహిస్తుండగా, కరోనా పరిస్థితులను వివరిస్తూ పోలీసులు వారికి నచ్చజెప్పారు. అనంతరం గిరిజనులను వారి వారి ప్రాంతాలకు తిప్పి పంపారు. ఈ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని, నిరాధార ప్రచారం చేయవద్దని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
బస్తర్ ఐజీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ర్యాలీ నిర్వహణకు వచ్చిన గిరిజనులు తిరిగి వెడుతుండగా డ్రోన్ కెమెరాలు చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. ఇదే వీడియోను నక్సలైట్లు వాగు దాటుతున్నారని ప్రచారం చేసి మీడియా మరోసారి ‘బకరా’ అయిందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోను చిత్రీకరించింది ఛత్తీస్ గఢ్ పోలీసులా? లేక తెలంగాణా పోలీసులా? అనేది మాత్రం బహిర్గతం కాలేదు.